Viral Video | నన్నే ఫొటో తీస్తారా అన్నట్టుగా.. పర్యాటకుల వైపు దూసుకొచ్చిన పులి..!
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహాలు, పులులు మొదటి స్థానంలో ఉంటాయి. వాటి పేరు విన్నా, అవి గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరిగెడతాం. అవి మన సమీపంలోకి వస్తున్నాయంటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. అయితే, దూరం నుంచి వాటిని చూసేందుకు మాత్రం ఆసక్తి చూపుతాం. తాజాగా ఓ పార్కులో సఫారీకి వెళ్లిన టూరిస్ట్‌లకు ఓ వింత అనుభవం ఎదురైంది. పులిని దూరం నుంచి చూస్తున్న సమయంలో అది ఒక్కసారిగా వారి వాహనానికి దగ్గరగా వచ్చి భయాందోళనకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) సురేంద్ర మెహ్రా ట్విట్టర్లో పోస్టు చేశారు.

వీడియోలో ఏముందంటే… కొందరు టూరిస్టులు ఓ పార్కులో సఫారీకి వెళ్లారు. అక్కడ పులులు ఉన్న చోటుకు వెళ్లి వాటిని తిలకిస్తుంటారు. ఇందులో భాగంగా పొదల చాటున నక్కిన ఓ పులిని గమనించిన టూరిస్టులు దాన్ని ఫొటోలు, వీడియోలు తీస్తూ బిజీగా ఉంటారు. ఆ సమయంలో పులి ఒక్కసారిగా పెద్దగా గర్జిస్తూ వారి వాహనం వద్దకు వస్తుంది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిస్తాడు. దీంతో ఆ పులి ఎవరికీ హానితలపెట్టకుండా అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతుంది.
ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘సఫారీకి వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని ఒకరు కామెంట్ చేయగా… ‘సఫారీ సమయంలో ప్రజలు ఎందుకు మౌనంగా ఉండలేరు..? వారు చేసే శబ్దాలు వన్యప్రాణులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాంటివారిని అడవిలోకి ప్రవేశించకుండా నిషేధించాలి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/surenmehra/status/1596716132266029058?s=20&t=5ipabYqNV1J4hoVu4WCYfg
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?