మిల్క్ క్రేట్ చాలెంజ్ గురించి మీకు తెలుసా? ఈ చాలెంజ్ గురించి ఎప్పుడైనా విన్నారా? మిల్క్ క్రేట్స్ తెలుసు కానీ.. ఈ చాలెంజ్ ఏంటి అంటారా? మన దగ్గర కాదు కానీ.. ప్రస్తుతం ఈ చాలెంజ్ అమెరికా, ఐరోపా లాంటి దేశాల్లో చాలా పాపులర్ అయిన డేంజరస్ గేమ్. అవును.. ఈ చాలెంజ్‌లో పాల్గొని ముక్కూ మూతీ పగులగొట్టుకొని, కాళ్లు చేతులు విరగ్గొట్టుకొని ఆసుపత్రుల్లో చేరినవారే ఎక్కువ. ఈ చాలెంజ్‌లో పాల్గొన్న వాళ్లలో 99 శాతం మంది ఇప్పుడు ఆసుపత్రుల్లో ఉన్నారు. అంత డేంజర్ ఈ చాలెంజ్. ఇదివరకు ట్రెండ్ అయిన బ్లూవేల్, మోమో లాంటి డేంజరస్ చాలెంజ్ ఇది.
అందుకే.. ఈ డేంజరస్ చాలెంజ్‌ను టిక్‌టాక్ బ్యాన్ చేసింది. ఆ చాలెంజ్‌కు సంబంధించిన వీడియోలను కూడా యాప్ నుంచి తొలగించినట్టు ప్రకటించింది. ఆ చాలెంజ్ పేరుతో ఏ యూజర్ కూడా వీడియోలు చేయకూడదని ప్రకటించింది.
ఈ చాలెంజ్ చాలా డేంజర్ అని… యూత్‌లో ఈ చాలెంజ్ క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోందని.. దాని వల్ల.. చాలామంది గాయాల పాలు అవుతున్నారని.. టిక్‌టాక్‌కు ఫిర్యాదులు రావడంతో ఆ చాలెంజ్‌ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది.
నిజానికి.. ఈ చాలెంజ్‌ను స్టార్ట్ చేసిందే టిక్‌టాక్‌లో. ఈ చాలెంజ్‌ను కొందరు యూజర్లు స్టార్ట్ చేసి.. తమ ఫ్రెండ్స్‌కు ఈ చాలెంజ్‌ను విసరడం.. వాళ్లు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొని మరికొందరికి చాలెంజ్ చేయడం.. ఇలా.. టిక్‌టాక్‌లో ఈ చాలెంజ్ తెగ పాపులర్ అయింది. మనదేశంలో టిక్‌టాక్ యాప్ బ్యాన్ కాబట్టి.. మన దాకా ఈ చాలెంజ్ రాలేదు.
మిల్క్ క్రేట్ చాలెంజ్ అంటే.. పాల కోసం ఉపయోగించే క్రేట్ల మీద చేసే చాలెంజ్. పాల క్రేట్లను తీసుకొని వాటిని పిరమిడ్ ఆకారంలో పేర్చాలి. పాల క్రేట్లు చాలా పలుచగా ఉంటాయనే విషయం తెలుసు కదా. వాటిని పిరమిడ్ ఆకారాంలో పేర్చాక.. ఒకవైపు నుంచి క్రేట్పైకి ఎక్కుతూ.. చివరగా పైన పేర్చిన క్రేట్ మీదికి ఎక్కి నిలబడాలి. చివర ఉన్న క్రేట్ మీద ఏమాత్రం కదలకుండా అలాగే కాసేపు నిలబడితే అప్పుడు ఈ చాలెంజ్‌లో గెలిచినట్టు.
ఆ తర్వాత.. మరో వైపు నుంచి క్రేట్ల మీద అడుగులు వేస్తూ దిగాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా.. క్రేట్ల మీద ఎక్కుతున్నప్పుడు కానీ.. పైన నిలబడినప్పుడు కానీ.. దిగేటప్పుడు కానీ.. క్రేట్లతో పేర్చిన పిరమిడ్ కూలిపోకూడదు. చాలెంజ్‌లో పాల్గొనే వ్యక్తి కింద పడకూడదు.
ఈ చాలెంజ్ పేరుతో చాలామంది యూత్.. క్రేట్ పిరమిడ్ ఎక్కుతూనే కింద పడి గాయాలపాలు అవుతున్నారు. అందుకే ఈ చాలెంజ్‌ను బ్యాన్ చేస్తున్నట్టు తాజాగా టిక్‌టాక్ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : నెట్టింట్లో మిల్క్ క్రేట్ చాలెంజ్!
Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం