Viral Video : ఫేవరేట్ హీరోల పాటలకు డ్యాన్స్ చేయడం లేదా వాటిని రిక్రియేట్ చేయడం వంటివి చాలామంది చేస్తుంటారు. అంతేకాదు వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి మురిసిపోతారు. తాజాగా ఒక గొర్రెల కాపరి బాలీవుడ్ హీరో గోవింద పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఆ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. దుల్హే రాజా టైటిల్ ట్రాక్‌కు అతను అచ్చం గోవింద లాగానే డ్యాన్స్ చేశాడు. పక్కన ఉన్న పిల్లాడు కూడా అతడిని అనుకరిస్తాడు. మరో అబ్బాయి గాడిద మీద కూర్చొని వేణువు వాయిస్తున్నట్టు నటిస్తాడు. ఈ ముగ్గురి వెనక గొర్రెల మంద కనిపిస్తుంది.
సినిమాలో దుల్హే రాజా పాటకు గోవింద, రవీనా ఠాండన్ డాన్స్ చేస్తారు. ఈ వీడియోను ఇప్పటికే 7 వేల మంది చూశారు. వీడియో చూసిన కొందరు బ్యాకప్ డాన్సర్ల కంటే ఈ గొర్రెల మంద చాలా బెటర్ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.