న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఫ్లైదుబాయ్ విమాన ఘటనతో భారత్ అప్రమత్తమైంది. ఇకపై అన్ని విమానాశ్రయాల్లో పూర్తి బాడీ స్కానర్లు (ఎఫ్బీఎస్)లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైమానిక భద్రతా వ్యవస్థ పటిష్ఠతలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్టు పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు. మొద టి దశలో ఎనిమిది విమానాశ్రయా ల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఆ శాఖ కార్యదర్శి సమీర్ సిన్హా తెలిపారు. ఇప్పటికే మూడు ఎయిర్పోర్టులకు స్కానర్ మిషన్లను పంపినట్టు తెలిపారు. మిగిలిన ఐదింటిలో త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.