e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News చాట్ బండి న‌డిపిస్తున్న డూప్లికేట్ కేజ్రీవాల్.. ఎక్క‌డో తెలుసా?

చాట్ బండి న‌డిపిస్తున్న డూప్లికేట్ కేజ్రీవాల్.. ఎక్క‌డో తెలుసా?

డూప్లికేట్ కేజ్రీవాల్ ఏంట‌ని అనుకుంటున్నారా? అవును అత‌ను అచ్చం అర‌వింద్ కేజ్రీవాల్ మాదిరిగానే ఉన్నారు. శ‌రీర ఆహార్యంతో పాటు ముఖ క‌వ‌ళిక‌ల్లోనూ ఏ మాత్రం తేడా లేదు. ఢిల్లీ కేజ్రీవాల్ కొంచెం హైట్ ఉన్నాడు. ఇత‌నేమో కొంచెం హైట్ త‌క్కువ ఉన్నాడు.. అంతే తేడా.. మిగ‌తా అంతా సేమ్ టు సేమ్.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ్వాలియ‌ర్‌లోని ఫూల్ బాగ్ ఏరియాలో మోతీ మ‌హ‌ల్ ముందు గుప్తా చాట్ పేరుతో ఓ స్టాల్‌ను నిర్వ‌హిస్తున్న వ్య‌క్తి.. అచ్చం ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను పోలి ఉన్నాడు. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అత‌ను ఆ చాట్ బండిని నిర్వ‌హిస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. ద‌హీ వ‌డ‌, పాపిడి చాట్, పాల‌క్ చాట్, స‌మోసా, క‌చోరీతో పాటు స్వీట్లు ఆ చాట్ బండి వ‌ద్ద ఫేమ‌స్. దీంతో అక్క‌డికి ఆహార ప్రియులు అధికంగా త‌ర‌లివ‌స్తుంటారు.

- Advertisement -

ఈ క్ర‌మంలో క‌ర‌ణ్ దువా అనే ఓ ఫుడ్ బ్లాగ‌ర్.. గుప్తా చాట్ నిర్వాహ‌కుడిని గ‌మ‌నించాడు. అత‌ను కేజ్రీవాల్‌లా ఉండ‌టంతో ఆ చాట్ నిర్వాహ‌కుడిపై కాస్త శ్ర‌ద్ధ పెట్టి వీడియో చిత్రీక‌రించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇక ఆ వీడియోకు భారీ స్పంద‌న వ‌చ్చింది. డూప్లికేట్ కేజ్రీవాల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ డూప్లికేట్ కేజ్రీవాల్‌ను ఒక్క‌సారైనా క‌ల‌వాలి అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement