Nepal Floods | నేపాల్ జలవిలయం.. 1344కు చేరిన మృతుల సంఖ్య..!
Nepal Floods | హిమాలయ దేశమైన నేపాల్ (Nepal) లో ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు (Nepal-Tibet Boarder) సమీపంలో భారీగా సంభవించిన గ్లేషియర్ బరస్ట్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి ప్రకోపం ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది.
Nepal Floods : హిమాలయ దేశమైన నేపాల్ (Nepal) లో ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు (Nepal-Tibet Boarder) సమీపంలో భారీగా సంభవించిన గ్లేషియర్ బరస్ట్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి ప్రకోపం ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తింది. అప్పటి నుంచి అక్కడ రక్షణ చర్యలు (Rescue Operations) కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించినా కొద్ది మృతదేహాలు (Dead Bodies) బయటపడుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య (Death Toll) 1344కు చేరింది.
ఈ విషాదంపై నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ వరదల ప్రభావం 32,933 మంది ప్రజలపై పడింది. విద్య, వైద్యం, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాలలు, విద్యా సంస్థల భవనాలు ధ్వంసం కావడంతో 6,500 మందికి పైగా విద్యార్థుల చదువు అర్ధాంతరంగా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా నేలమట్టం కాగా.. మరో మూడు కేంద్రాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాంతో బాధితులకు తక్షణ అత్యవసర వైద్యం అందించడం సవాలుగా మారింది.
సుమారు 55 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లోని 37 మోటారు వంతెనలు, స్థానిక రాకపోకలకు ఆధారమైన 68 వేలాడే వంతెనలు తుడిచిపెట్టుకుపోయాయి. దీనివల్ల పలు మారుమూల గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. నష్టంపై సమగ్ర అధ్యయనం ఇంకా కొనసాగుతోందని, పూర్తిస్థాయి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

