Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
5 నెలలకే పుట్టాడు | ఒక బిడ్డ తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి ఈ భూమ్మీదకు వచ్చే దాక ఎన్నో అవాంతరాలను దాటాలి. మధ్యలో ఏమాత్రం తేడా వచ్చినా
ఒక బిడ్డ తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి ఈ భూమ్మీదకు వచ్చే దాక ఎన్నో అవాంతరాలను దాటాలి. మధ్యలో ఏమాత్రం తేడా వచ్చినా కడుపులో బిడ్డకు ప్రమాదమే.. తల్లికి ప్రమాదమే. అందుకే.. గర్భిణీలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మంచి ఆహారం అందిస్తారు.

అయినప్పటికీ.. కొందరు నెలలు నిండకముందే ప్రసవిస్తారు. సాధారణంగా 9 నెలల పాటు తల్లి బిడ్డను తన కడుపులో మోయాల్సిందే. కొందరు 7 నెలలకే ప్రసవిస్తారు. ఇంకొందరు 8 నెలలు.. ఇలా నెలలు నిండకముందు జన్మించిన పిల్లల్లో నూటికి 90 మంది పిల్లలు పుట్టగానే చనిపోతారు. ఒక్కరో ఇద్దరో బతుకుతారు.
కానీ.. ఓ మహిళ 5 నెలలకే ప్రసవించింది. 5 నెలలకే బిడ్డను కన్నది. కనడమే కాదు.. తన కొడుకును కాపాడుకొని.. తన కొడుకు గిన్నిస్ రికార్డ్ నెలకొల్పేలా చేసింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది.
అలబమాకు చెందిన ఓ మహిళ గర్భం దాల్చిన 21 వారాలకే డెలివరీ అయింది. దీంతో 420 గ్రాముల బరువుతో బిడ్డ పుట్టాడు. అతడిని కాపాడుకోవడం కోసం చాలా కష్టాలు పడింది ఆ మహిళ. ఇప్పుడు తన కొడుకు పుట్టి 16 నెలలు అవుతుంది. ఇప్పుడు ఏ సమస్యా లేదు. అందరు పిల్లల్లాగానే ఆ పిల్లాడు కూడా ఆడుకుంటాడు. ఆహారం తింటాడు. నవ్వుతాడు.. ఏడుస్తాడు.. అన్నీ చేస్తాడు.
అలా 5 నెలలకే పుట్టి.. బతికి బట్టకట్టిన వాళ్లు చాలా అరుదు. అందుకే ఆ చిన్నారి పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కించారు. ప్రపంచంలో అత్యంత తక్కువ నెలల్లో పుట్టి బతికిన పసికందుగా నమోదు చేశారు.
నిజానికి.. ఆ మహిళ కవలలకు జన్మనిచ్చింది. అందులో ఒకరు అమ్మాయి. మరొకరు అబ్బాయి. పుట్టగానే అమ్మాయి చనిపోయింది కానీ.. అబ్బాయి మాత్రం వైద్యానికి సహకరించడంతో వైద్యులు ఆ పిల్లాడని కాపాడగలిగారు. దాదాపు 9 నెలల పాటు బాబును ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించి.. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

