Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Anupama Parameswaran | సినిమా సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు అభిమానులు వారితో ఫొటోలు దిగాలని, మాట్లాడాలని కోరుకోవడం సహజం. అయితే అభిమానం పేరుతో కొందరు హద్దులు దాటడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనకు ఎదురైన ఇలాంటి ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.
Anupama Parameswaran | సినిమా సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు అభిమానులు వారితో ఫొటోలు దిగాలని, మాట్లాడాలని కోరుకోవడం సహజం. అయితే అభిమానం పేరుతో కొందరు హద్దులు దాటడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనకు ఎదురైన ఇలాంటి ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఎయిర్‌పోర్టులో కొందరు తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తూ, తనను తాకుతూ ప్రవర్తించడంతో మానసికంగా ఇబ్బందికి గురైనట్లు ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడింది. తాను కూడా గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు వివరించింది.
ఒకసారి ఎయిర్‌పోర్టులో తన లగేజీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు తన దగ్గరకు వచ్చారని అనుపమ తెలిపింది. తొలుత మాట్లాడేందుకు ప్రయత్నించిన వారు, ఆ తర్వాత తన అనుమతి లేకుండానే ఫొటోలు తీయడం ప్రారంభించారని చెప్పింది. తాను ఒంటరిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కొందరు చుట్టుముట్టి ఫొటోలు తీస్తూ, తాకుతూ ప్రవర్తించడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఎదురైందని వివరించింది. ఆ సమయంలో తనకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, ఈ ఘటన మానసికంగా తనపై ప్రభావం చూపిందని అనుపమ పేర్కొంది. అభిమానులతో ఫొటోలు దిగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అనుపమ స్పష్టం చేసింది. అయితే ఫొటోలు తీసుకునే సమయంలో కొందరు ప్రవర్తించే తీరు తనను ఆందోళనకు గురిచేస్తుందని చెప్పింది. ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తారో, అనుమతి లేకుండా ఎక్కడ తాకుతారో అనే భయం ఉంటుందని వెల్లడించింది.
ఒక సెలబ్రిటీగా అభిమానులతో కలవడం, వారితో ఫొటోలు దిగడం తన వృత్తిలో భాగమే అయినప్పటికీ, అందుకు కొన్ని పరిమితులు ఉండాలని ఆమె అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రిటీలను చూసినప్పుడు ఫొటోలు తీసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తుంది. అయితే వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, చుట్టుముట్టడం లేదా శారీరకంగా తాకడం వల్ల వారు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తమ భద్రత గురించి ఆందోళన చెందాల్సి వస్తుందని అనుపమ తన అనుభవం ద్వారా వివరించింది. సాధారణంగా అమ్మాయిలు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారని ఆమె పేర్కొంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే మహిళల ధైర్యాన్ని అభినందించింది అనుపమ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

