Thiruvananthapuram Mayor : తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్(Arya Rajendran) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈమధ్యే తల్లి అయిన ఆమె నెల రోజుల వయసున్న బిడ్డతో విధులకు హాజరైంది. పాపను ఒడిలో పట్టుకొని ఆఫీస్‌లో ఫైళ్లపై సంతకాలు చేస్తూ కెమెరావాళ్ల కంట పడింది. ప్రస్తుతం ఆర్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈకాలం మహిళలు వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారని, మాతృత్వం అనేది ఆడవాళ్ల కెరీర్‌కు అడ్డంకి కాదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం పబ్లిసిటీ కోసమే ఆర్య అలా చేస్తోందంటున్నారు. ఇకొందరైతే పని ప్రదేశాల్లో పసిపిల్లల్ని చూసుకునే ఏర్పాట్లు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండేళ్ల క్రితం ఆర్య రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్ పదవికి ఎంపికైంది. అప్పటికీ ఆమె వయసు 21 ఏళ్లు. దాంతో, దేశంలోనే చిన్న వయస్కురాలైన మేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఆతర్వాత ఆమె సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్ దేవ్(Sachin Dev)ను పెళ్లి చేసుకుంది. నెల రోజుల క్రితమే ఆర్య రాజేంద్రన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.