సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన సామాజిక కార్యకర్త, సీనియర్ నేత దుబ్బాక రమేష్ (Dubbaka Ramesh) సొంతగూటికి చేరుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో బీజేపీలో
చేరిన రమేష్ సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికైన తన సతీమణి రజిత, స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయనను తెలంగాణ భవన్లో కలిశారు.
ఈసందర్భంగా దుబ్బాక రజిత, రమేప్లను కేటీర్ శాలువాతో సన్మానించి.. సర్పంచ్‌గా గెలిచినందుకు అభినందించారు. తమను తిరిగి పార్టీలో చేర్చుకున్నందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు రమేష్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, మాజీ ఎఎంసీ చైర్ పర్సన్ పూసపల్లి సరస్వతి, సింగిలల్ విండో మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితర నేతలు ఉన్నారు.