ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఎలా భగ్గుమంటున్నాయో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు లీటర్‌కు సెంచరీ దాటేశాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర సుమారు 106 రూపాయలుగా ఉంది. దీంతో కొందరు పెళ్లి గిఫ్ట్‌లుగా పెట్రోల్‌ను ఇస్తున్నారు. ఇదివరకు ఉల్లిగడ్డలు రేట్ పెరిగినప్పుడు చాలామంది పెళ్లి కానుకగా ఉల్లిగడ్డలను పంపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా పెట్రోల్ రేట్లు పెరగడంతో.. ఓ టాప్ కమెడియన్.. నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
ఆయన ఎవరో తెలుసా? తమిళంలో టాప్ కమెడియన్‌గా కొనసాగుతున్న మయిల్‌సామీ. ఆయన చాలా సినిమాల్లో కమెడియన్‌గా నటించాడు. తాజాగా ఆయన ఇచ్చిన పెళ్లి కానుకకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసన వ్యక్తం చేయడం కోసమే మయిల్‌సామీ.. అలా పెళ్లి కానుకగా పెట్రోల్‌ను ఇచ్చినట్టు వెల్లడించారు. అంతే కాదు.. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయలు తగ్గించి.. ఆ మూడు రూపాయలను ప్రభుత్వమే భరిస్తుండటాన్ని ఆయన అభినందించారు. మయిల్‌సామీ.. రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఆయన ఇదివరకు ఒకసారి విరుగమ్బక్కమ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్‌కు వీరాభిమాని.
Comedian #Mayilsamy gave #Petrol as a gift to newly wed couple. pic.twitter.com/N3n3xGt2Li
— Manobala Vijayabalan (@ManobalaV) August 16, 2021