Watch: గొడుగులు పట్టుకుని క్లాస్‌లో పాఠాలు వింటున్న విద్యార్థులు… ఎక్కడంటే?
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రంలో మరో దుస్థితి వెలుగు చూసింది. తరగతి గదుల శ్లాబ్ నుంచి వర్షం నీరు కారడంతో విద్యార్థులు ఏకంగా గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన సియోని జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఘన్సర్లోని ఖైరీ కాలా ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. స్కూల్లోని క్లాస్ రూమ్‌లు శిథిలావస్థకు చేరినా పాలకులు పట్టించుకోవడం లేదు. అక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తరగతి గదుల శ్లాబ్‌ల నుంచి వర్షం నీరు ధారగా కారుతుంది. దీంతో చాలా మంది విద్యార్థులు స్కూలుకు రావడం లేదు.
అయితే స్కూలుకు వచ్చిన కొద్ది మంది విద్యార్థులు తమ వెంట గొడుగులు కూడా తెచ్చుకుంటున్నారు. క్లాస్ రూమ్ శ్లాబ్‌ల నుంచి కారుతున్న వర్షం నీరు తమపై పడకుండా గొడుగులు పట్టుకుని టీచర్ చెప్పే పాఠాలు వింటున్నారు. స్కూల్ దుస్థితి గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రిన్సిపల్ ఆరోపించారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘నయా భారత్‌లో నయా అభివృద్ధి’ ఇదేనంటూ ప్రధాని మోదీ, ఎంపీ ప్రభుత్వంపై నెటిజన్లు మండిపడ్డారు. ‘అబద్ధాల మోదీని తొలగించాలి’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.
https://twitter.com/vansh_h1/status/1552151418660098048?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1552151418660098048%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Fmirror-now%2Fin-focus%2Fseoni-students-seen-holding-umbrellas-inside-classroom-to-protect-themselves-from-rain-water-pouring-through-leaking-roof-article-93162809
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

