సారీ, సారీ, సారీ… ‘క్షమించు’ అంటూ స్కూల్ ప్రాంగణమంతా రెడ్ పెయింట్
బెంగళూరు: ఒక స్కూల్ ప్రాంగణమంతా ‘సారీ’ అంటూ పెద్దగా రెడ్ పెయింట్‌తో రాశారు. స్థానికులతోపాటు పోలీసుల దృష్టిని ఇది ఆకట్టుకుంది. ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ ‘క్షమించు’ అంటూ స్కూల్ ప్రాంగణంతోపాటు సమీపంలోని వీధుల్లో రాసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. సుంకడకట్టే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ స్కూలు మెట్లు, ప్రాంగణంతోపాటు పరిసర వీధుల్లో ఇంగ్లీష్‌లో ‘సారీ’ అంటూ పెద్దగా ఎర్రటి రంగుతో రాశారు. బుధవారం ఉదయం ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎవరు, ఎవరికి ఎందుకు ‘సారీ’ చెప్పారో అన్నది ఎవరికీ అర్థం కాలేదు.
మరోవైపు ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇది రాసిన వారిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫుడ్ డెలివరీ బ్యాగ్‌లో పెయింట్స్ తెచ్చి ఆ ప్రాంతమంతా ఇలా ఇంగ్లీష్‌లో ‘సారీ’ అని రాసినట్లు గుర్తించారు. అయితే ఆ వ్యక్తులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. వారి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు పశ్చిమ బెంగళూరు డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. దీనిపై ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

