హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఒక్కోచోట ఒక్కో రకంగా సంబురాలు నిర్వహించుకుంటారు. చాలాచోట్ల మొహానికి రంగులు పూసుకుంటారు. కొన్నిచోట్ల కోడిగుడ్లు, టమాటాలతో కొట్టుకుంటారు. ఉత్తరాదిన కొన్నిచోట్ల లాత్మార్ హోలీ .. అంటే ఒకరినొకరు తన్నుకుంటూ సంబురాలు చేసుకుంటారు. కానీ బీహార్ రాజధాని పాట్నాలో ఓ వెరైటీ సంప్రదాయం ఉంది.
పాట్నాలో చెప్పల్ మార్ హోలీ జరుపుకుంటారు. కొంతమంది రెండు వర్గాలుగా విడిపోయి రంగు నీళ్లలో నిల్చుని ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుంటారు. పాటలకు నృత్యం చేస్తూ చెప్పులను పట్టుకుంటారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్చేయగా, వైరల్ అయ్యింది. 1.29 నిమిషాలున్న ఈ వీడియోను నెటిజన్లు పెద్ద సంఖ్యలో వీక్షించారు. సరదా కామెంట్లతో హోరెత్తించారు.
पटना की ‘चप्पल मार’ होली …ऐसी होली देखी है कहीं? pic.twitter.com/U5xuTN3Lk7
— Utkarsh Singh (@UtkarshSingh_) March 17, 2022