నటి, వ్యాపారవేత్త, తల్లి, ఫిట్నెస్ ఔత్సాహికురాలు, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోషల్‌మీడియాలో చాలా ఫేమస్. ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన డైలీ అప్డేట్స్ను ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు ఉంచుతుంది. ఇటీవల ఆమె ఖాళీగా ఉన్న బస్సులో వర్కౌట్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను మై మండే మోటివేషన్ అనే క్యాప్షన్‌తో శిల్పాశెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఖాళీ బస్సులో పుల్-అప్స్, పుష్-అప్స్ వర్కౌట్స్ చేసింది.. అలాగే, ఖాళీ బస్సు లోపల ఆమె వర్కౌట్ సెషన్ ముగిసిన తర్వాత హ్యాండిల్స్‌ను కూడా తుడిచింది. తన ప్రయాణంలో రెండు మిషన్స్.. ఫిట్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ కంప్లీట్ అయ్యాయని శిల్పాశెట్టి పేర్కొంది. కాగా, ఆమె డెడికేషన్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చేస్తున్నారు.