e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News Bathing on Buffalo : బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్‌

Bathing on Buffalo : బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్‌

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారారు. ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్‌, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన పదునైన రాతలతో విమర్శకులకు ఇదే వేదిక ద్వారా జవాబిస్తుంటారు. సెహ్వాగ్‌ పోస్టింగ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు.

వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నది. ఈ వీడియోలో ఒక పిల్లవాడు బర్రెను పైపుతో స్నానం (Bathing on Buffalo) చేయిస్తూ.. తానూ స్నానం చేస్తూ ఆ ఎంజాయ్‌మెంట్‌ను ఆస్వాదిస్తున్నాడు. పిల్లవాడు బర్రెపైన నిలబడి, కొన్నిసార్లు కూర్చొని, మరోసారి పడుకుని నీళ్లు పోస్తూ కనిపిస్తాడు.

- Advertisement -

ఈ వీడియోతో పాటు అందాజ్ చిత్రంలోని రాజేష్ ఖన్నా పాట ‘జిందగీ ఏక్ సఫర్ హై సుహానా’ ను జత చేయడం వీడియోకు మరింత అందం చేకూరింది. ‘పల్లె జీవితం.. నగరాల ప్రజలకు ఈ వినోదం తెలియదు’ అని ఈ వీడియోకు శీర్షికగా సెహ్వాగ్‌ రాశారు. ఒక్కరోజులోనే ఈ వీడియోకు 2.39 లక్షల మంది లైక్‌ కొట్టగా.. వేయికి పైగా నెటిజెన్లు కామెంట్లు రాశారు. మరెందరో దీన్ని షేర్‌ చేసుకున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

గెలీలీయో టెలిస్కోప్‌కు 412 ఏండ్లు

జేమ్స్‌ బాండ్‌ మ్యూజిక్‌తో అలరించిన ముంబై పోలీసులు

మర్మాంగానికి సీల్‌.. యువకుడు మృతి

ఈ ఆహారాలు తీసుకోండి‌.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement