సీ లయన్స్ లేదా సముద్ర సింహాలు.. సీల్ లాగా ఉంటాయి. కానీ, ఆకారంలో కాస్త పెద్దగా ఉండి భూమిపై నడవగలవు. కాగా, బీచ్‌లో ఓ వ్యక్తి సేదతీరుదామనుకున్నాడు. విలాసవంతమైన కుర్చీలో పడుకున్నాడు. కానీ సముద్రంలోంచి ఈదుకుంటూ వచ్చిన ఓ సీ లయన్ అతడిని అక్కడినుంచి వెళ్లగొట్టేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాలో ‘వైరల్హగ్’ పేజీ అప్లోడ్ చేసింది. ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ దీవుల్లోని బీచ్‌సైడ్ రిసార్ట్‌లో ఈ సంఘటన జరిగింది. సముద్రంలోంచి ఈదుకుంటూ బీచ్ ఒడ్డుకు వచ్చిన సీ లయన్‌ను చూసి కుర్చీలోంచి ఓ వ్యక్తి లేచి పక్కకు వెళ్లిపోయాడు. ఆ సీ లయన్ దర్జాగా ఆ కుర్చీ ఎక్కి పడుకుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 13వేలకు పైగా లైక్స్ వచ్చాయి.