న్యూఢిల్లీ : కర్నాటకలోని బెలగావిలో జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ మ్యాచ్‌లో అద్భుత బౌండరీ క్యాచ్ వీడియోను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్రికెటర్ కిరణ్ తరలేకర్ బౌండరీ లైన్ వద్ద ఒడిసిపట్టుకున్న ఈ క్యాచ్‌ను గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్‌టైమ్ అంటూ ఇంటర్నెట్లో కొనియాడుతున్నారు.
This is what happens when you bring a guy who also knows how to play football!! ⚽️ 🏏 😂 https://t.co/IaDb5EBUOg
— Sachin Tendulkar (@sachin_rt) February 12, 2023
ఈ క్లిప్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ ఇంగ్లీష్ క్రికెటర్ మైఖేల్ వాఘన్, న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషంలను ఆకట్టుకోవడం విశేషం. ఈ వైరల్ క్లిప్‌లో కిరణ్ బౌండరీ లైన్ వద్ద గాలిలోకి ఎగిరి బాల్‌ను క్యాచ్ పడుతుండటం కనిపిస్తుంది. బౌండరీ లైన్‌ను క్రాస్ చేయకముందే కిరణ్ బంతిని పట్టుకుని మరోసారి గాలిలో జంప్ చేయడం చూడవచ్చు.
ఈ వీడియోను తొలుత స్పోర్ట్స్ ఆన్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఫుట్‌బాల్ ఆడటం కూడా తెలిసిన వ్యక్తిని మీరు తీసుకువస్తే ఇలాగే జరుగుతుందని టెండూల్కర్ రాసుకొచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 20 లక్షల మందికి పైగా వీక్షించారు. కిరణ్ తరలేకర్ క్యాచ్‌కు ట్విట్టర్ యూజర్లు ఫిదా అయ్యారు. ఇది అద్భుతమైన క్యాచ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఫుట్‌బాల్ మ్యాచ్ వార్మప్‌ను తలపిస్తోందని మరో యూజర్ రాసుకొచ్చారు.