వడపావు ధర ఎంత ఉంటుంది? రోడ్‌సైడ్ అయితే రూ.25.. కొంచెం మంచి హోటల్లోనైతే రూ.50. కానీ ఇండిగో ఫ్లైట్‌లో వడపావు ధర రూ. 250 అట. ఈ ధర చూసి ఓ ప్రయాణికుడు నోరెళ్లబెట్టాడు. అంతేకాదు ఇండిగో ఫ్లైట్ మెనూను ట్విట్టర్లో పెట్టాడు. *నేను ఫ్లైట్‌లో ఇకపై ఏదైనా తింటూ మీకు కనిపిస్తే ఇక్కడినుంచి నన్ను తోసేయండి* అంటూ ఫొటోకు క్యాప్షన్ రాశాడు. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.
ఈ ట్వీట్ చూసి నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఫ్లైట్‌లో ఆహారం ఎంత ఖరీదో చెప్పుకొచ్చారు. *మూడేళ్ల క్రితం నేను ఫ్లైట్‌లో చికెన్ నూడుల్స్ తిన్న.. దాని ధర రూ. 300..ఇప్పటిదాకా మరిచిపోలేకపోతున్నా* అని హర్షిత్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. *నేను ఓ సారి పోహా తిన్నాను. ఫ్లైట్ సిబ్బంది దాని ధర రూ. 200అని చెప్పారు. సిబ్బందికి నో చెప్పలేక అంతపెట్టి తినేశాను.* అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. అంత పెట్టితిన్నా అవి టేస్ట్‌గా లేవంటూ బాధపడ్డారు.
Mujhe kabhi ye flight mein khaate dekhlo to plane se hi neeche fek dena pic.twitter.com/6tAstH3wiz
— Pulkit Kochar (@kocharpulkit) March 13, 2022