పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భుబన్ బద్యాకర్ పాడిన కచ్చాబాదాం పాట ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నది. ఈ పాటపై చిన్నా, పెద్ద తేడాలేకుండా స్టెప్పులేస్తున్నారు. ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, ఓ పాకిస్తానీ సింగర్ కచ్చాబాదాం స్టైల్లో రంజాన్ పాట పాడారు. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలకు పెట్టింది పేరైన పాకిస్తాన్ యూట్యూబర్ యాసిర్ షోహర్వాడి ఈ పాటను పాడారు. ‘రోజా రఖుంగా’ అంటూ కచ్చాబాదాం స్టైల్లో పాటందుకున్నాడు. అయితే, ఈ పాటపై చాలామంది మండిపడ్డారు. మతమరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.