రైల్వే స్టేషన్లో యాచకురాలిగా కాలం వెళ్లదీస్తున్న రాను మొండల్‌ను సోషల్‌మీడియా ఓవర్‌నైట్ సెలెబ్రిటీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే రాను మొండల్ ఒకే ఒక్క వీడియో వైరల్ కావడంతో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమ్మియా .. తాను నటించి కంపోజ్ చేసిన ‘తేరీ మేరీ కహానీ’లో రాను మొండల్‌తో మూడు పాటలు పాడించారు. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కొద్దికాలంగా ఎక్కడుందో.. ఏం చేస్తుందో కూడా తెలియలేదు. కాగా, ఓ బంగ్లాదేశ్ పాటతో రాను మొండల్ తాజాగా వైరల్ అవుతోంది.
బంగ్లాదేశ్ సూపర్‌స్టార్ హీరో ఆలం నటిస్తున్న ఓ సినిమాలో రాను మొండల్ పాట పాడింది. తన సినిమాలోని ‘తుమీ చారా అమీ’ అనే పాట రికార్డింగ్‌కు సంబంధించిన వీడియోను ఆలం షేర్ చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆలం, రాను మొండల్ ఇద్దరూ కలిసి పాట పాడుతుంటారు. ఇద్దరూ ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతుంటారు. చిరునవ్వులు చిందిస్తూ మెలొడీ పాటను పాడారు. ఈ వీడియో చూసిన చాలామంది ‘వెల్ కం బ్యాక్ మొండల్’ అని కామెంట్ చేశారు. కాగా, పలువురు ఆమెను ట్రోల్ చేయడం కూడా కనిపించింది.