ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని పెద్దలు అంటుంటారు. కానీ అమ్మాయి అంటే సమాజంలో ఇప్పటికీ ఓ చిన్నచూపే ! మగ పిల్లాడు పుడితే సంబురాలు చేసుకుంటూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఆ కుటుంబం మాత్రం ఆడపిల్ల అంటే అదృష్టమని భావించింది. లేక లేక ఆడపిల్ల పుట్టిందని ఊరంతా అవాక్కయ్యేలా సంబురాలు చేసుకుంది. పుట్టిన బిడ్డను ఏకంగా హెలికాప్టర్లోనే ఇంటికి తీసుకొచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తమ కుటుంబంలో పుట్టిన మొదటి ఆడబిడ్డకు బ్యాండ్ బాజాలతో ఘన ఘనంగా స్వాగతం పలికింది.
రాజస్థాన్‌లోని నౌగౌర్ జిల్లా నింబిడి చందావాతాకు చెందిన హనుమాన్ ప్రజాపత్, చుకీదేవి దంపతులకు గత నెలలో ఆడ శిశువు జన్మించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం ఆనంతరం చుకీదేవి తన పుట్టింటికి వెళ్లింది. అక్కడే పాపకు రియా అని నామకరణం చేశారు. అయితే ప్రజాపత్ తండ్రి మదన్‌లాల్ కుటుంబంలో 35 ఏళ్లుగా ఒక్క ఆడబిడ్డ కూడా జన్మించలేదు. దీంతో లేక లేక పాప పుట్టడంతో ఎంతో సంతోషపడింది ఆ కుటుంబం. ఇన్నేళ్లకు పుట్టిన ఆడపిల్లను మామూలుగా కాకుండా.. అందరూ చెప్పుకునేలా ఇంటికి తీసుకురావాలని భావించాడు ఆ పాప తాత మదన్ లాల్. ఆ మధుర క్షణం పదికాలాల పాటు గుర్తుండిపోయేలా ఉండాలని అనుకున్నాడు. ఇందుకోసం కోడలు, మనవరాలిని తీసుకొచ్చేందుకు రూ. 4.5లక్షలు పెట్టి ఏకంగా ఒక హెలికాప్టర్‌నే బుక్ చేశాడు.
Rajasthan: A family from a village in Nagaur district hired a helicopter to bring home their new born girl child.
— ANI (@ANI) April 23, 2021
"After 35 years we have been gifted with a daughter in the family so we made this arrangement. I'll fulfill all her dreams" said Madan Lal, grandfather of the baby. pic.twitter.com/0j3NT8E4jL
జిల్లా అధికారులతో మాట్లాడి తన కోడలి గ్రామంలో, తమ స్వగ్రామంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేయించుకున్నాడు. కోడలి ఇంటికి హెలికాప్టర్లో వెళ్లిన మదన్‌లాల్.. అక్కడ పాప పేరు మీద ప్రత్యేక పూజలు చేసి తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అక్కడ పాపపై పూలు జల్లుతూ మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఒక ఉత్సవంలో ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆడపిల్ల అంటే భారం కాదని.. పాప పుడితే సంబురపడాలని చెప్పడానికే ఇలా చేశామని పాప తండ్రి హనుమాన్ ప్రజాపత్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కూరగాయలు అమ్ముతున్న వానరం..
Largest Divorce : విడాకులు తీసుకున్న తల్లి.. 750కోట్లు భరణం చెల్లించనున్న కొడుకు
తెలంగాణలో ఉచితంగా కరోనా టీకా : సీఎం కేసీఆర్
రెమ్‌డెసివిర్‌కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి