తెలంగాణలో ఉచితంగా కరోనా టీకా : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు

హైదరాబాద్ : కరోనా టీకా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు అని తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు.
వయసుతో సంబంధం లేకుండా టీకా
స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ. 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందనీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మొత్తం రాష్ట్రంలో వున్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
టీకాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు
ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జులను నియమించడం కూడా జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
టీకాలు, రెమిడెసివర్, ఆక్సిజన్ కొరత రానివ్వం
వాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెమిడెసివర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టుతుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రజలను అధైర్య పడవద్దని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వుండవద్దని సీఎం కోరారు.
స్వయం క్రమశిక్షణ పాటించాలి
పెద్ద ఎత్తున గుంపు-గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందని సీఎం కేసీఆర్ మరోమారు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ప్రజల సహకారంతోనే ప్రగతిపథంలో పాలనా వ్యవస్థ : సీఎం కేసీఆర్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం
వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 3.46లక్షల కేసులు
ఆక్సిజన్ కొరత.. 20 మంది మృతి, మరో 200 మంది ప్రాణాలకు ముప్పు
ఇక ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా నెగెటివ్ తప్పనిసరి
విపత్తులో తెలియును భాగ్యనగర మహత్తు
చిన్నారులపై వైరస్ పంజా!
మే ఆఖరుకు తగ్గుముఖం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

