చిరుతపులులు, పులులు, సింహాలు పాములను వేటాడడం చాలా అరుదుగా చూస్తుంటాం. కాగా, ఓ కొండచిలువపై చిరుతపులి దాడిచేస్తుండగా, అదేస్థాయిలో కొండచిలువ ప్రతిఘటించింది. రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
మొదట చెట్టుచాటున ఉన్న కొండచిలువపై చిరుతపులి దాడిచేసింది. భారీ కొండచిలువ కూడా చిరుతపైకి దూకి ప్రతిఘటించింది. చిరుతను చుట్టేసింది. కానీ, చిరుతపులి కొండచిలువపై ఒక్కసారిగా పంజా విసిరింది. అనంతరం దాన్ని పట్టుకొని వెళ్లిపోయింది. ఈ వీడియోను యూట్యూబ్లో ‘నాప్ నెట్వర్క్’ అప్లోడ్ చేయగా, ఇప్పటివరకూ 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.