Don’t Want to Beg : నేను ఎవ్వరి దగ్గరా చేయి చాచను.. ఈ పెన్ను కొనండి చాలు.. ఈ బామ్మకు హేట్సాఫ్ చెప్పాల్సిందే
నేను ఎవ్వరి దగ్గరా చేయి చాచను.. ఈ పెన్ను కొనండి చాలు | చాలామంది కాళ్లు, చేతులు బాగున్నా కూడా పని చేయచేతగాదు. రూపాయి కూడా సంపాదించరు. కానీ.. ఈ బామ్మ
చాలామంది కాళ్లు, చేతులు బాగున్నా కూడా పని చేయచేతగాదు. రూపాయి కూడా సంపాదించరు. కానీ.. ఈ బామ్మ చూడండి.. వయసు మీదపడినా.. లేచి నడిచే స్థోమత లేకున్నా.. ఎవ్వరినీ చేయి చాచి రూపాయి అడగడం లేదు. ఈ వయసులో కూడా రోడ్డు మీద పెన్నులు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తోంది. ఈ బామ్మను చూసి మనమంతా చాలా విషయాలు నేర్చుకోవాలి.

నాకు అడుక్కోవాలని లేదు. 10 రూపాయలు పెట్టి ఈ పెన్ను కొనండి. బ్లూ కలర్ పెన్స్ అంటూ ఆ బామ్మ ఓ బోర్డు పెట్టుకొని పూణె రోడ్ల మీద ఆ పెన్నులు అమ్ముతోంది. ఆ బామ్మ ఫోటోను ఓ యువతి ఫోటో తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఆ బామ్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వయసులో కూడా ఎంతో నిజాయితీతో ఉండి.. తన కాళ్ల మీద తాను నిలబడుతున్న ఈ బామ్మను చూసి ఎంతో నేర్చుకోవాలి. రతన్ అనే బామ్మ ప్రతి రోజు ఉదయమే లేవగానే అన్ని పనులు ముగించుకొని తన దగ్గర ఉన్న పెన్నుల డబ్బాలు పట్టుకొని రోడ్డు మీదికి బయలుదేరుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగగానే… ప్రతి వాహనం దగ్గరికి వెళ్లి పెన్నులు కొనాలని వాహనదారులను రిక్వెస్ట్ చేస్తుంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. అమ్ముడు పోయిన పెన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో తన రోజువారి జీవితాన్ని వెళ్లదీస్తుంది. ఈ వయసులో కూడా ఎవరి మీద ఆధారపడుకుండా తన కాళ్ల మీద తాను నిలబడిన ఈ బామ్మకు హేట్సాఫ్ చెప్పాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rattlesnakes : పాములు బాబోయ్ పాములు.. ఇంట్లో తిష్ట వేసిన 92 స్నేక్స్
Costly Tea : ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
Farmer’s Desi Jugaad : పక్షుల నుంచి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి
Naked Woman : నగ్నంగా ఎయిర్పోర్ట్లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

