ఓ యువతి ఎయిర్‌పోర్ట్‌లో నగ్నంగా హల్చల్ చేసింది. యూఎస్‌లోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా.. నగ్నంగా యువతి ఎయిర్‌పోర్ట్‌లో తిరిగింది. తోటి ప్రయాణికులకు గ్రీటింగ్స్ చెబుతూ తన చేసిన హడావుడి చూసి ఇతర ప్రయాణికులు బిత్తరపోయారు.
వెంటనే అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఎయిర్పోర్ట్ పోలీసులు అక్కడికి చేరుకొని తన మీద బ్లాంకెట్ కప్పబోయారు. దీంతో హేయ్.. ఎలా ఉన్నారు? ఎక్కడ నుంచి వచ్చారు? అంటూ వాళ్లకు కూడా తను గ్రీటింగ్స్ చెప్పబోయింది.
ఆ తర్వాత తనను తీసుకెళ్లి తనకు బట్టలు వేయించారు. తన మానసిక పరిస్థితి బాగాలేదని అందుకే తనను వెంటనే ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సెప్టెంబర్ 19న ఉదయం 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎయిర్ పోర్ట్‌లో ఉన్న ప్రయాణికులు అయితే నగ్నంగా ఉన్న ఆ యువతిని చూసి షాక్ అయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bhangra Dance : పంజాబీ పాటకు రావణుడి భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్
ముంబై, కోల్‌కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
Dussehra | దసరా రోజు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?
ప్రిన్సిపల్ పోస్టు కోసం కొట్టుకున్నారు.. వీడియో
dussehra | దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?