ఆ హోటళ్లోని టాయిలెట్లో 30 ఏళ్లుగా సమోసాలు తయారు చేస్తున్నారు. ఒక్క సమోసాలేకాదు ఇతర స్నాక్స్కూడా అక్కడే వండివారుస్తారు. ఇందుకు ఉపయోగించే పదార్థాలన్నీ గడువు ముగిసినవే. వీటితోపాటు వండిన పదార్థాలపై కీటకాలు, ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. ఆ హోటల్‌పై రైడింగ్‌కి వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. మూడు దశాబ్దాలుగా టాయ్లెట్లోనే సమోసాలు తయారుచేస్తున్నారని తెలుసుకుని అవాక్కవడం అధికారుల వంతైంది. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుంది? అనేకదా మీ ప్రశ్న. ఈ హోటల్ సౌదీ అరేబియాలోని జెడ్డా మున్సిపాలిటీ రెసిడెన్షియల్ భవనంలో ఉంది.
ఈ హోటల్‌పై సౌదీ అరేబియా అధికారులు అకస్మాత్తుగా దాడిచేశారు. 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ సైట్లో కీటకాలు, ఎలుకలు కూడా కనిపించాయి.
ఈ రెస్టారెంట్‌లోని వాష్‌రూంలోనే స్నాక్స్తోపాటు భోజనాన్ని కూడా సిద్ధంచేస్తున్నట్లు గుర్తించిన అధికారులు విస్తుపోయారు. ఈ తినుబండారాల్లో మాంసం, చీజ్ లాంటి గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగించినట్లు కనుగొన్నారు. అందులో కొన్నింటి గడువు ముగిసి రెండేళ్లు అయిందని గుర్తించారు. అలాగే, ఈ రెస్టారెంట్‌లోని కార్మికులకు హెల్త్ కార్డులు లేవని, రెసిడెన్సీ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నారని అధికారులు కనుగొన్నారు. వెంటనే ఆ హోటల్‌ను మూసేశారు. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.