లిఫ్ట్‌లో పిల్లోడిని కరిచిన కుక్క.. పట్టించుకోని మహిళ.. వీడియో
లక్నో : ఓ స్కూల్ పిల్లోడు లిఫ్ట్‌లో వెళ్తున్నాడు. అదే లిఫ్ట్‌లోకి ఓ మహిళ తన పెంపుడు కుక్కతో వెళ్లింది. క్షణాల్లోనే ఆ కుక్క అబ్బాయిని కరిచింది. ఆ బాలుడు ఏడుస్తున్నప్పటికీ మహిళ పట్టించుకోలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ హౌజింగ్ సొసైటీ లిఫ్ట్‌లో చోటు చేసుకుంది.
రాజనగర్ ఎక్స్టెన్షన్ చార్మ్స్ కంట్రీ సొసైటీకి చెందిన లిఫ్ట్‌లో ఓ విద్యార్థి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎక్కాడు. అదే లిఫ్ట్‌లో ఓ మహిళ కూడా తన పెంపుడు కుక్కతో ఎక్కింది. ఆ కుక్క బాలుడిపై దాడి చేసి కరిచింది. కాలికి మంట కావడంతో.. బాలుడు బాధపడుతున్నప్పటికీ, ఆ మహిళ స్పందించలేదు. కనీసం గాయమైందా? రక్తస్రావం అవుతుందా? అని అడగలేదు. ఆ తర్వాత తన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ దిగి వెళ్లిపోయింది. లిఫ్ట్ దిగే ముందు కూడా ఆ కుక్క విద్యార్థిపై మరోసారి దాడి చేసేందుకు యత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కుక్క యజమానురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ये वीडियो ग़ाज़ियाबाद का है। जहां लिफ़्ट में कुत्ते ने एक बच्चे को काट लिया।
गौर करने वाली बात है कि बच्चा दर्द में दिख रहा है पर फिर भी मानों जैसे कुत्ते की मालकिन पर इसका कोई असर ही नहीं। pic.twitter.com/5JLhPdNQgd
— Shubhankar Mishra (@shubhankrmishra) September 6, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

