నీటిలో ఉండే పెంగ్విన్ల సమూహాన్ని రాఫ్ట్ అని, భూమిపై ఉండే వాటిని వాడిల్ అని పిలుస్తారు. ఈ పెంగ్విన్లకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెంగ్విన్ల సమూహం ఓ సీతాకోక చిలుకను వెంటాడుతున్న వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.
ఈ వీడియోను ‘బిటెంగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. పెంగ్విన్ల గుంపు ఓ సీతాకోకచిలుకను పట్టుకునేందుకు ముద్దుముద్దుగా ఎగురుతూ ముందుకుసాగుతున్నాయి. ఈ వీడియో చిన్నదే అయినా నెటిజన్లు రిపీట్ చేస్తూ చూశారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 3.2 మిలియన్ల కంటే ఎక్కువమంది వీక్షించారు. ఈ వీడియో మనసుకు ఆహ్లాదం కలిగించిందని కామెంట్ చేశారు.
Penguins chasing a butterfly.. 😅 pic.twitter.com/ynP6oW49zm
— Buitengebieden (@buitengebieden) June 4, 2022