లంబోర్ఘినీ డ్యాన్స్‌తో వైరల్ అయిన వృద్ధ సిక్కు జంట మీకు గుర్తుందా? మార్చి 2019లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఈ జంట లంబోర్ఘినీ పాటపై అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ వీడియో ఆన్లైన్లో సంచలనంగా మారింది. నెట్టింట చక్కర్లు కొట్టింది. కాగా, ఆ జంట మరోసారి మరోకొత్త పాటతో తళుక్కుమన్నారు. ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ‘ఐ లైక్ మీ బెటర్ ఎక్స్ దిల్దారా’ అనే పాటపై స్టెప్పులేశారు. ఓ వేడుకలో ఈ జంట వృద్ధాప్యంలోనూ యూత్‌లా డ్యాన్స్ చేస్తుంటే అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో బారాటింక్ అనే యూజర్ అప్లోడ్ చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 2.3 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. అలాగే, నెటిజన్లు మంచి మంచి కామెంట్లుకూడా పెట్టారు. తాను కూడా 60 ఏళ్ల వయస్సులో ఇలాగే డ్యాన్స్ చేస్తానని ఒకరు పేర్కొనగా, తన లైఫ్ పార్ట్నర్తో ఒకరోజు ఇలాంటి స్టెప్పులేస్తానని మరొకరు వ్యాఖ్యానించారు.