పాట్నా: జేబులు కొట్టేవాడు అతి తెలివి ప్రదర్శించాడు. ఏకంగా రైల్వే బ్రిడ్జీ పైనుంచి వేలాడుతూ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి జేబులు, మొబైల్స్‌ను కొల్లగొడుతున్నాడు. బీహార్‌లోని పాట్నా- బెగుసరాయ్లను కలిపే రాజేంద్ర సేతు రైల్వే వంతెనపై జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే బ్రిడ్జీపై ఇంటర్ సిటీ రైలు వెళ్తున్నది. ఒక బోగిలోని డోర్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆ ఇనుప వంతెనపై వేలాడుతున్న ఒక దొంగ, డోర్ వద్ద కూర్చొన్న వ్యక్తి చేతిలోని మొబైల్ ఫోన్‌ను కొట్టేశాడు. ఆ వ్యక్తి ఆ విషయాన్ని వెంటనే గ్రహించలేక పోయాడు.
షాక్ నుంచి తేరుకున్న అతడు పైకి లేచి రైలు నుంచి తొంగి బయటకు చూశాడు. బ్రిడ్జీపై వేలాడుతున్న వ్యక్తి తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను చాకచక్యంగా చోరీ చేసినట్లు చివరకు గ్రహించాడు. మరోవైపు వెరైటీగా మొబైల్ ఫోన్లు, జేబులు కొట్టేసే ఈ దొంగకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘బీహార్‌లోని రైల్వే వంతెనపై కొత్త స్పైడర్ మ్యాన్’ పేరుతో ఈ వీడియోను కొందరు షేర్ చేశారు. రైల్వే వంతెనపై ప్రమాదకరంగా వేలాడుతూ రైల్లో ప్రయాణించే వారి జేబులు, మొబైల్స్‌ను లూఠీ చేస్తున్న అతడి తెలివిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేశారు. ఇలాంటి చోరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొందరు సూచించారు.
#Breaking
New spider man found on Indian railways bridge in Bihar.चलती ट्रेन से मोबाइल झपट लिया #बिहार pic.twitter.com/qnerokQIaF
— Capt. Kanika Bhardwaj (@capt_kanika) June 9, 2022