Monalisa | కుంభమేళాలో పూసలు అమ్ముతూ సాధారణ జీవితం గడిపిన ఓ అమ్మాయి ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారింది. ఆమె పేరే మోనాలిసా. తేనెపట్టు వంటి కళ్లతో, చక్కని చిరునవ్వుతో, అమాయకమైన హావభావాలతో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. మహాకుంభ్ మేళాలో పూసలు అమ్ముతుండగా ఆమె వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి మహాకుంభ్ మేళాకు వెళ్లి పూసల దండలు అమ్ముతుండగా కొందరు వ్యక్తులు ఆమెను వీడియో తీయడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ క్షణం మోనాలిసా జీవితం మారిపోయింది. ఆమె అందం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
వైరల్ అయిన కొద్ది రోజులకే బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాను గుర్తించి తన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. “ది డైరీ ఆఫ్ మణిపూర్” చిత్రంలో మోనాలిసా నటించి వెండితెరపై అరంగేట్రం చేసింది. చిన్న పాత్ర అయినా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.తాజాగా మోనాలిసా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె ‘లైఫ్’ అనే పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ‘క్రష్’, ‘ఇట్స్ ఓకే గురు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో చరణ్ సాయి సరసన నటిస్తోంది.
‘లైఫ్’ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్‌పై అంజయ్య విరిగినేని, ఉషా విరిగినేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.కుంభమేళాలో పూసలు అమ్మిన అమ్మాయి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా మారడం నిజంగా స్ఫూర్తిదాయకం. మోనాలిసా అందం, వినయంతోపాటు ఆమె జీవిత ప్రయాణం ఇప్పుడు యువతకు ఆదర్శంగా మారుతోంది.