Viral Video : బైక్ మీద స్టంట్స్ చేస్తే ఇలాగే అవుతుంది..
కొందరు రోడ్ల మీద స్టంట్స్ చేస్తుంటారు. పబ్లిక్కు ఇబ్బంది కలిగేలా ఏం చేసినా అది తప్పే. దానికి శిక్ష కూడా పడుతుంది. పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తారు. తాజాగా ముంబైలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్తూ ఏదో స్టంట్ చేయబోయారు. రోడ్డు మీద వెళ్తుండగా.. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి.. ముందు వ్యక్తి కడుపులో పిడిగుద్దు గుద్దాడు. ఆ తర్వాత బైక్ రైడ్ చేసే వ్యక్తి వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని కొట్టబోయాడు. ఇంతలో ఆ వ్యక్తి బైక్ దిగాడు. ఇతడికి బైక్ బ్యాలెన్స్ ఆగక.. కిందపడినట్టు యాక్షన్ చేస్తాడు. అయితే.. ఇదంతా వాళ్లు చేసిన స్టంట్ అన్నమాట.

దీనికి సంబంధించిన వీడియో ముంబై పోలీసులకు చేరడంతో.. వెంటనే దాన్ని తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు మంచి క్యాప్షన్ కూడా పెట్టారు. అటెన్షన్ బార్బీ గర్ల్.. ఇది వాస్తవిక ప్రపంచం.. లైఫ్ అనేది ప్లాస్టిక్ కాదు.. సేఫ్టీ ముఖ్యం.. రోడ్డు మీద రాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ చేసినందుకు.. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరినీ ఐపీసీ, ఎమ్డబ్ల్యూఏ సెక్షన్లు 279 కింద బుక్ చేస్తూ.. వాళ్ల లైసెన్స్ కూడా సస్పెండ్ చేశాం.. అని ట్వీట్ ద్వారా ముంబై పోలీసులు వెల్లడించారు.
ఇక… ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అయితే.. ముంబై పోలీసుల క్యాప్షన్‌కు పడిపోతున్నారు. మంచి పని చేశారు.. ఇలా రోడ్ల మీద స్టంట్స్ చేస్తూ సాధారణ జనాలకు ఇబ్బందులకు గురి చేస్తే.. ఇలాగే అవుతుంది.. అంటూ ముంబై పోలీసులను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.
Attention barbie girl, it's the real world
— मुंबई पोलीस Mumbai Police (@MumbaiPolice) August 12, 2021
Life isn't plastic- safety’s fantastic!
Take precaution, life is your creation.
Both the accused booked under section 279 of IPC & MVA sections for dangerous & rash driving. License suspended too! #TunesOfLaw #RoadSafety pic.twitter.com/OGxYBS0XKi
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

