ట్విటర్ అకౌంట్లో మనం ఏదైనా పోస్ట్ చేస్తే ఎడిట్ చేయడం కుదరదు. ఏదైనా తప్పుగా పోస్ట్ అయితే మొత్తం డిలీట్ చేసి, మళ్లీ పోస్ట్ చేయాల్సిందే. అయితే, ఎడిట్ ఆప్షన్‌పై పనిచేస్తున్నాం అని ట్విటర్ ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రకటించింది. దీనిపై తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో పంచ్వేశారు. ఇది ఏప్రిల్ ఫూల్ ప్రకటనైతే కాదుకదా అని చమత్కరించారు. ట్విటర్ కంటే తమ అధికారులే నయం అని వ్యంగ్యంగా అన్నారు.
శశిథరూర్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వర్తమాన రాజకీయాలపై ట్విటర్లో పోస్ట్‌లు పెడుతుంటారు. కాగా, ట్విటర్లో ఎడిట్ ఆప్షన్ పెట్టాలని 2018లో ట్విటర్ సీఈవో జాక్ డోర్సేకిని కోరారు. అయితే, నాలుగేళ్ల తర్వాత ట్విటర్ స్పందించడంపై శశిథరూర్ జోకులు పేల్చారు. మీకంటే తమ అధికారులే వేగంగా పనిచేస్తారంటూ చలోక్తులు విసిరారు. శశిథరూర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. ఒక్కరోజులోనే మిలియన్‌కంటే ఎక్కువ మంది లైక్ చేయగా, లక్ష మంది ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
Don’t know if @twitter’s edit button tweet was an April Fool’s joke that they forgot to disown, but if it’s real, thanks for listening in 2018 & acting in 2022! Even responses from our bureaucracy tend to be quicker…. pic.twitter.com/hyRCqkHbZy
— Shashi Tharoor (@ShashiTharoor) April 4, 2022