దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమినుంచి తప్పించుకునేందుకు జనాలు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కాగా, సూరత్‌లోని ఓ పెళ్లిబృందం వినూత్న ఐడియాతో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. కదిలే పందిరి కింద బరాత్ తీస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ట్విటలర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో వరుడు గుర్రంపై ఉండగా, బంధువులు కదిలే పందిరికింద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వారికి ఎండ తగలకుండా ఆ పందిరిని నాలుగుమూలలా నలుగురు ముందుకు జరుపుతూ కదులుతున్నారు. ఈ వీడియో చూసినవారంతా ఆశ్చర్యపోయారు. ఇండియన్స్ అంటేనే క్రియేటివిటీకి మారుపేరని నెటిజన్లు కామెంట్ చేశారు.
Sun shade and mobile secure enclosure for barat. Innovations galore pic.twitter.com/rdxUV45Qfg
— Aviator Anil Chopra (@Chopsyturvey) April 27, 2022