సృజనాత్మకత, ఆవిష్కరణల నైపుణ్యం భారతీయుల రక్తంలోనే ఉంది. ఇటీవల ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్మిల్ తయారుచేసి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పాలు అమ్ముకునే వ్యక్తి పాల క్యాన్లు తీసుకెళ్లేందుకు ఫార్ములా 1 రేస్ కారులాంటి వాహనం తయారు చేశాడు. అందులో పాలక్యాన్లు వేసుకొని రోడ్డుపై వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘రోడ్స్ ఆఫ్ ముంబై’ అనే ఆటోమొబైల్ సంఘం ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాలు అమ్ముకునే వ్యక్తి పాలక్యాన్లను ఫార్ములా 1 రేస్ కారులాంటి వాహనంలో వేసుకుని వెళ్తుంటాడు. ఫార్ములా 1 డ్రైవర్లాగే జాకెట్, హెల్మెట్ ధరించాడు. ఈ వీడియోను షేర్ చేసిన అతికొద్ది గంటల్లోనే 52వేల మంది వీక్షించారు. ఫార్మాలా 1 కారు రేసర్ కావాల్సిన వ్యక్తి ఆ కోరిక నెరవేరకపోవడంతో తన వృత్తిలోనే ఆ సంతృప్తి పొందుతున్నాడని పలువురు కామెంట్ చేశారు. అతడి ప్రతిభకు నెటిజన్లు అందరూ సెల్యూట్ చేశారు.
When you want to become a F1 driver, but the family insists in helping the dairy business 👇😜 pic.twitter.com/7xVQRvGKVb
— Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) April 28, 2022