పాట్నా: గాయపడిన ఒక కోతి ఊహించని విధంగా ఒక క్లినిక్‌కు వెళ్లింది. రోగి మాదిరిగా వైద్యుడితో చెకప్ చేయించుకుని చికిత్స పొందింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన బీహార్‌లోని ససారంలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం షాజమా ప్రాంతంలోని డాక్టర్ ఎస్ఎం అహ్మద్ క్లినిక్‌కు ఒక కోతి తన పిల్లతో సహా వచ్చింది. అక్కడి బెడ్‌పై కూర్చొని డాక్టర్ పరీక్షించేందుకు ఎదురు చూసింది. కాగా, కోతి ఒక్కసారిగా తన క్లినిక్‌లోకి రావడంతో డాక్టర్ అహ్మద్ తొలుత కొంత భయపడ్డారు. అయితే ఆ కోతి ముఖం వైపు చూసిన ఆయన అది గాయపడినట్లు గ్రహించారు. దీంతో ఆ గాయాలపై అయింట్మెంట్ పూశారు. అలాగే టెటానస్ ఇంజక్షన్ ఇచ్చారు. కాగా, చికిత్స పొందుతున్నంత సేపు ఆ కోతి ఎంతో సహనంగా ఉండి అక్కడి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంది.
మరోవైపు ఈ విషయం తెలిసిన స్థానికులు, గాయాలకు చికిత్స కోసం క్లినిక్‌కు వచ్చిన కోతిని చూసేందుకు ఎగబడ్డారు. ఆ క్లినిక్ ఎదుట గుమిగూడారు. అయితే కోతికి చికిత్స అందించిన డాక్టర్ అహ్మద్, వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. అప్పుడే ఆ కోతి తన క్లినిక్ నుంచి బయటకు వెళ్తుందని వారితో చెప్పారు. జనం అక్కడి నుంచి వెళ్లిన కొంత సేపటి తర్వాత ఆ కోతి కూడా తన పిల్లతో సహా వెళ్లిపోయింది. కాగా, క్లినిక్‌లో చికిత్స పొందిన కోతి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5
— manish (@manishndtv) June 8, 2022