న్యూఢిల్లీ : బిహార్‌కు చెందిన సామాన్యుడు దిల్ దే దియా హై సాంగ్‌ను హృద్యంగా ఆలపించగా పెద్దసంఖ్యలో నెటిజన్లను ఆకర్షించడంతో వైరల్‌గా (Viral Video)మారింది. ఈ వీడియోను నీతు చంద్ర, సోనూ సూద్, బ్యూరోక్రాట్ అవనీష్ శరణ్ వంటి సెలబ్రిటీలు షేర్ చేశారు.
बिहार के इस लड़के ने अपने सुरों से दिल जीत लिया, क्या सुरीली आवाज़ है 👌#Bihar pic.twitter.com/vynhN1q9Bs
— Aapna Bihar (@Aapna__Bihar) February 21, 2023
బాలీవుడ్ సాంగ్స్‌ను అద్భుతంగా ఆలపిస్తున్న యువకుడు బిహార్‌లోని సమస్తపూర్కు చెందిన అమర్జీత్ జైకర్గా వెల్లడైంది. ట్విట్టర్ బయోలో జైకర్ తనను తాను సింగర్, పెర్ఫామర్‌గా చెప్పుకొన్నారు.
పలు బాలీవుడ్ ట్రాక్‌లను పాడుతున్న తన వీడియోలను జైకర్ తరచూ షేర్ చేస్తుంటారు. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మూవీ నుంచి అమర్జీత్ జైకర్ ఆలపించిన ఫిర్ భి తుమ్కో చాహుంగ వీడియోను డైరెక్టర్ వినోద్ కాప్రి షేర్ చేశారు. ఈ వీడియోలో జైకర్ నేలపై ఇటుకలు పేర్చుతూ కనిపిస్తాడు.
Read More :