న్యూఢిల్లీ : బేబీ వీడియోలు ఇంటర్నెట్లో నెటిజన్లను ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ బుడతడు తప్పటడుగులు వేస్తూ ఒక్కసారిగా డ్యాన్స్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నడవడానికి బదులు చిన్నారి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది.
జర్నలిస్ట్ మరియ ష్రివర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 48 లక్షల వ్యూస్ లభించాయి. ఈ వైరల్ వీడియోలో చిన్నారి నడుస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వినిపిస్తుండటంతో ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించడం కనిపిస్తుంది.
డ్యాన్స్ చేస్తుంటే నువ్వు ఇక నడవడం ఎందుకు ? గ్రేట్ వీకెండ్! నవ్వుతూ..డ్యాన్స్ చేసే క్షణాలు నీ ముందుంటాయని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇలానే డ్యాన్స్ చేస్తూ ఎదగాలని ఓ యూజర్ కామెంట్ చేశారు. బేబీ క్యూట్ డ్యాన్స్‌పై పెద్దసంఖ్యలో నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :