పులి, సింహం… ఈ పేర్లు వినగానే ఎవరికైనా ఒంట్లో వణుకుపుడుతుంది. వాటి గర్జన వినగానే ఆమడ దూరం పరిగెడతాం. సింహం పిల్లలను చూసినా అదే భయం ఉంటుంది. కుక్కల్ని, పిల్లుల్ని, పాముల్ని పెంచుకుంటున్నట్లు వాటిని పెంచుకోవడానికి సాహసించము. ముఖ్యంగా అవి బంధీ వాతావరణానికి సరిపోవు. ఒకవేళ పెంచుకున్నా వాటి మృగ స్వభావం ఎప్పుడో ఒకసారి బయట పడక తప్పదు. అలాంటి విషయాన్నే తెలియజేస్తోంది ఈ వీడియో.
basitayan3748 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో క్లిప్‌లో ఓ వ్యక్తి, రెండు సింహం పిల్లల్ని మచ్చిక చేసుకోవాలని అనుకుంటాడు. సింహం పిల్లలు కారు వెనుక భాగంలో కూర్చొని ఉండగా, సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తి తన చేతులతో వాటిపై నెమురుతూ ఉంటాడు. ఒకదాన్ని నెమిరిన తర్వాత మరో సింహం పిల్లను నెమిరేందుకు ప్రయత్నిస్తాడు. అది ఒక్కసారిగా అతనిపై గర్జిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో సదరు వ్యక్తి వెంటనే వెనక్కి వెళ్తాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ సింహం పిల్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అది అక్కడి నుంచి కారుపైకెక్కిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోకి ఇప్పటి వరకు 2,76,423పైగా లైక్స్, మూడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. షాకింగ్‌గా ఉన్న సింహం పిల్లల గర్జన మీరూ చూసేయండి.