Pothole : రోడ్డు మీద గుంత కనిపించింది.. అరటి చెట్టు నాటేశాడు.. వైరల్ వీడియో
రోడ్డు మీద గుంత కనిపించింది.. అరటి చెట్టు నాటేశాడు | రోడ్ల మీద గుంతలు ఉండటం సహజమే. బాగా వర్షాలు పడటం వల్లనో.. లేదా వేసిన రోడ్ల నాణ్యత లేకపోవడం వల్లనే రోడ్ల మీద గుంతలు పడుతుంటాయి.
రోడ్ల మీద గుంతలు ఉండటం సహజమే. బాగా వర్షాలు పడటం వల్లనో.. లేదా వేసిన రోడ్ల నాణ్యత లేకపోవడం వల్లనే రోడ్ల మీద గుంతలు పడుతుంటాయి. అయితే.. ఆ గుంతల వల్ల వాహన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా బైక్ మీద వెళ్లేవాళ్లు అయితే.. ఆ గుంతలను చూడకుండా డ్రైవ్ చేస్తే అంతే సంగతులు. బైక్ స్కిడ్ అయి కిందపడటమో.. లేక టైర్ పగలడమో.. లేక బైక్ కు ఏదైనా సమస్య రావడమో జరుగుతుంది.

అయితే.. రోడ్ల మీద గుంతలు మన దేశంలోనే కాదు.. విదేశాల్లోని ప్రయాణికులను వేధిస్తాయని తాజాగా రుజువైంది. యూఎస్ లోని ఫ్లొరిడాలో ఉండే వ్యక్తి రేమాండ్.. ఉండే ఏరియాలో రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడిందట. ఆ ప్రాంతంలో గుంతలు పడటం ఇదే తొలిసారి ఏం కాదు. కానీ.. తాజాగా పడిన గుంత మధ్యలో ఉండటం.. అది రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుండటంతో.. అధికారులకు ఈ విషయాన్ని వెరైటీగా చెప్పడం కోసం.. ఆ వ్యక్తి ఏకంగా ఆ గుంతలో అరటి చెట్టును నాటేశాడు.
దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆ అరటి చెట్టు మీద పడింది. అక్కడున్న వాళ్లు ఆ గుంతలో నాటిన అరటి చెట్టును చూసి ఆశ్చర్యపడటం పక్కన పెడితే.. దాని వల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆ అరటి చెట్టును అలాగే రోడ్డు మధ్యలోనే ఉంచేశారట. ఆ రోడ్డు నుంచి వెళ్లే వాహనదారులు.. ఆ చెట్టుకు ఢీకొట్టకుండా.. పక్క నుంచి వెళ్తున్నారట. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా భలే ఐడియా అంటూ ఆ వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. అలా చేస్తేనే అధికారులు వెంటనే మేల్కొంటారు. అటువంటి గుంతలు ఉంటే పూడ్చేస్తారు.. అని అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

