టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం !
మార్కెటింగ్ శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలను సాంతికేతతో అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని ఇంటి దొంగలే అడ్డుకుంటున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చి పంటల కొనుగోళ్లు, విక్రయాలు, మార్కెట్ ఫీజు వసూళ్లను పక్కాగా పర్యవేక్షించేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించేందుకు కొందరు అధికారులు ససేమిరా అంటున్నట్టు తెలుస్తున్నది.
- మార్కెటింగ్ శాఖలో ఆగని అవకతవకలు?
- టెక్నాలజీ అమలుకు అధికారుల అడ్డుపుల్ల
- మంత్రి ఆదేశించినా అమలుచేయని వైనం
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మార్కెటింగ్ శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలను సాంతికేతతో అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని ఇంటి దొంగలే అడ్డుకుంటున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చి పంటల కొనుగోళ్లు, విక్రయాలు, మార్కెట్ ఫీజు వసూళ్లను పక్కాగా పర్యవేక్షించేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించేందుకు కొందరు అధికారులు ససేమిరా అంటున్నట్టు తెలుస్తున్నది. ఓ వైపు ఏఐ యుగం రాజ్యమేలుతుంటే.. ఆ శాఖలో మాత్రం ఇప్పటికీ కాగితాలనే నమ్ముకోవడం గమనార్హం. ఒకవేళ పూర్తిస్థాయి సాంకేతికతను అమలుచేస్తే తమ బాగోతం బయట పడుతుందని మదనపడుతున్నట్టు సమాచారం. కొందరు మార్కెట్ కార్యదర్శులు, ప్రధాన కార్యాలయంలోని పలువురు అధికారులతో కుమ్మక్కై అడ్డుకుంటున్నారని సమాచారం.
మంత్రి ఆదేశాలు బేఖాతర్
మార్కెటింగ్ శాఖలో అవినీతిని గుర్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.. ప్రతి లావాదేవీని ఆన్లైన్ చేయాలని మూడేండ్లుగా చెప్తూనే ఉన్నారు. అయినా అమాత్యుని ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. ఇప్పటివరకు సాంకేతికతను వినియోగించిన పాపాన పోలేదు. మంత్రి ఎన్ని సమీక్షలు చేసినా అధికారులు మాత్రం వారికి నచ్చిందే చేశారు తప్ప పట్టించుకున్నది లేదు. పలు సందర్భాల్లో అధికారులుపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినా వారి వైఖరిలో మార్పు కనిపించకపోవడం గమనార్హం.
అయినా నిర్లక్ష్యం..
పత్తి కొనుగోళ్లు ఎక్కువగా జరిగే మార్కెట్లలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. నిరుడు పలువురు మార్కెట్ కార్యదర్శులను మంత్రి సస్పెండ్ చేయడమే ఇందుకు బలం చేకూర్చుతున్నది. మార్కెట్ ఫీజును తప్పుదారి పట్టించినందుకు వారిపై వేటు పడింది. మార్కెట్ ఫీజు వసూళ్లలో అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా మార్కెట్లలో అవినీతికి అంతులేకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యవసాయ మారెట్ యార్డుల్లో రైతులు తీసుకొచ్చే పంటలు మొదలుకొని వ్యాపారుల కొనుగోలు వరకు ప్రతి దశనూ డిజిటల్ విధానంలో నమోదు చేస్తే అక్రమాలకు ఆసారం తగ్గుతుంది.
పంటల రాక, తూకం, వేలం, విక్రయ ధరలు, వ్యాపారుల లావాదేవీలు, మారెట్ ఫీజు వివరాలన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయి. ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడంతోపాటు ఫీజు ఎగవేతకు అవకాశం లేకుండా పర్యవేక్షించవచ్చు. రైతులు కూడా తమ పంటకు వచ్చిన ధర, విక్రయ వివరాలు తక్షణమే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇన్ని ప్రయోజనాలున్న వ్యవస్థను అమలుచేయడంలో మాత్రం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తే వారి అక్రమాలు, అవకతవకలకు చెక్ పడుతుందనే ససేమిరా అంటున్నన్నారని ఆ శాఖలో చర్చ జరుగుతున్నది.
ఈసారైనా అమలయ్యేనా?
తాజాగా ఏఐ ఆధారిత డిజిటల్ మారెట్ యార్డు వ్యవస్థను అమలుచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించి, సాంకేతికత వినియోగానికి సంబంధించి వారంలో టెండర్లు పిలువాలని ఆదేశించారు. రైతు మారెట్ యార్డులోకి ప్రవేశించినప్పటి నుంచి పంట విక్రయించి, చెల్లింపులు పొంది, మారెట్ నుంచి బయటకు వెళ్లేదాకా ప్రతి దశనూ ఒకే డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రైతు వివరాల నమోదు, ప్రతి పంట లాట్కూ ప్రత్యేక ఐడీ కేటాయింపు, డిజిటల్ బిడ్డింగ్ లేదా టెండర్ నమోదు, పంట నాణ్యత పరీక్ష, ఆన్లైన్ వేలం, ధర నిర్ణయం, రైతు అంగీకారం, పంట తూకం, అమ్మకపు బిల్లుల తయారీ, మారెట్ చార్జీల లెకింపు, రైతులకు చెల్లింపులు, గేట్ ఎగ్జిట్ నమోదు, ఈ-రసీదులు, ఈ-పర్మిట్ల జారీ వరకు అన్ని ప్రక్రియలు ఒకే వేదికపై నిర్వహించేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.
అయితే గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు తీరును పరిశీలిస్తే ఈసారి కూడా ప్రకటనలకే పరిమితమవుతుందేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారైనా మంత్రి ఆదేశాలు అమలవుతాయా అనే చర్చ జరుగుతున్నది. లేదా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అక్రమార్కులు పైచేయి సాధిస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం మరింత పక్కాగా పర్యవేక్షిస్తే యార్డుల్లో సాంకేతికతను అమలుచేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టు సాంకేతికత అమలును అడ్డుకొని అక్రమార్కులు రెచ్చిపోతారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం !
8 తెలంగాణ ప్రగతికి ఐఆర్సీ వేదిక కావాలి: కోమటిరెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రగతికి వేదిక కావాలని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. 19న కేంద్రమంత్రి నితిన్ గడరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అంతర్జాతీయ డెలిగేట్లు, ఇంజినీరింగ్ నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర రోడ్ నెట్వర్, రైల్వే ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయని, ఇది తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలువనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్సీ ప్రీ-సమ్మిట్‌గా నిలవాలని మంత్రి సూచించారు. సమీక్షలో ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్, ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష!
కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం!
8 ఖేలో ఇండియా- 2026 ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

