Viral Video | పాపులారిటీ కోసం కొందరు యువతీ యువకులు ప్రమాదకర స్టంట్లు, విన్యాసాలు చేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఓ యువకుడికి కూడా అదే పరిస్థితి తలెత్తింది. రైల్వే ప్లాట్ ఫామ్ పై ప్రమాదకరంగా విన్యాసాలు చేసి జైలు పాలయ్యాడు.
బీహార్ (Bihar)లోని మాన్సూర్ జంక్షన్ (Manpur junction) రైల్వే ప్లాట్ ఫామ్ పై ఓ యువకుడు కార్ట్ వీల్స్ (cartwheels) వేస్తూ ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై రైల్వే పోలీసులు తీవ్రంగా స్పందించారు. సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. యువకుడి విన్యాసాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆర్పీఎఫ్ (Railway Protection Force) పోలీసులు.. రైల్వే స్టేషన్ లో న్యూసెన్స్ చేస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు గానూ యువకుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested by #RPF for creating nuisance and unauthorized entry.
We hope this will serve as a lesson for others who put their lives at risk for likes and shares in social media. #SafetyFirst pic.twitter.com/qDCj9H9mFK
— RPF INDIA (@RPF_INDIA) July 10, 2023
Also Read..
Joe Biden | పొరపాటా..? గ్రహపాటా.. మరోసారి నోరు జారిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..!
Tomatoes | 2 వేల బాక్సులు.. రూ.38 లక్షలు.. కర్ణాటక రైతుకు వరంగా మారిన టమాటా ధరలు
Sadha | అందుకే పెళ్లి చేసుకోలేదు.. పెళ్లిపై సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్