Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. దీనికంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి ఉండదు. అలాంటి క్రూర జంతువుని చూసినా.. దాని పేరు విన్నా, అది గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరిగెడతాం. అది మన సమీపంలోకి వస్తుందంటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. అలాంటిది మనం ప్రయాణించే వాహనంలోకి సింహం చొరబడితే…! ఊహించుకుంటేనే ప్రాణాలు పోయినట్టు అనిపిస్తోంది కదూ. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
కొందరు టూరిస్టులు ఓ పార్కులో సఫారీకి వెళ్లారు. అక్కడ సింహాలు ఉన్న చోటుకు వెళ్లి వాటిని తిలకిస్తున్నారు. అయితే వారికి అనుకోకుండా అక్కడ ఊహించని అనుభవం ఎదురైంది. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ సింహం వారు ప్రయాణిస్తున్న వాహనంలోకి దూకేసింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అనంతరం ఆ సింహం వాహనంలోని ప్రతి ఒక్కరిని తడుముతూ కనిపించింది. ఊహించని ఘటనతో టూరిస్టులు సైతం భయపడకుండా ఆ సింహాన్ని ఎంతో ప్రేమగా నెమురుతూ కనిపించారు.
18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను oddly terrifying అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశారు. ఈ వీడియోకు ‘న్యూ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది వారు తెలపలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
New wildlife experience 😬 pic.twitter.com/1J74oTKgWW
— OddIy Terrifying (@OTerrifying) November 8, 2022