న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో క్యూట్ యానిమల్స్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. తాజా వీడియోలో హెయిర్‌డ్రెస్సర్ ఓ పిల్లికి ట్రిమ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పుడిది వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌ను ఇప్పటివరకూ 20 లక్షల మందికి పైగా వీక్షించారు.
just a little off the top pic.twitter.com/LqcCdZQ6Vt
— chaotic cat pictures & videos (@chaoticcatpics) November 16, 2022
హెయిర్‌డ్రెస్సర్ ముందు పిల్లి ఓ హ్యూమన్ కస్టమర్ మాదిరి ఓపికగా కూర్చోవడం నెటిజన్లను ఆకర్షించింది. క్యూట్ క్యాట్ పిల్లల్లా ఎలాంటి అల్లరి చేయకుండా బుద్ధిగా హెయిర్ కట్ చేయించుకుందని పలువురు యూజర్లు మెచ్చుకున్నారు. హెయిర్ కట్ కోసం తన కంటే ఈ పిల్లి బాగా కూర్చుని హెయిర్డ్రెస్సర్కు సహకరించిందని ఓ యూజర్ రాసుకొచ్చారు.