చిరుత పులి… పేరు వినగానే ఆమడదూరం పరిగెడతాం. ఎవరైనా దీని కంటపడితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు. షాకింగ్ విషయం ఏంటంటే ఓ యువతి చిరుతను ముద్దాడింది. కుక్కల్ని, పిల్లుల్ని, పక్షుల్ని ముద్దాడటం చూశాం. చిరుతను ముద్దాడటం ఏంటి..? అని అనుకుంటున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
ఆఫ్రికన్ ఎనిమల్ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో చిరుత వద్ద పడుకుని ఉన్న ఓ యువతి దాన్ని ముద్దాడుతూ కనిపించింది. చిరుత సైతం ఏమీ అనకుండా నాలుకతో యువతిని నెమురుతూ ఉంది. కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘ఓ మై గాడ్.. ఈ జంతువు యువతిని ముద్దాడుతోంది’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చెయ్యగా.. ‘‘రెండు చిరుతలు ఒకే ఫ్రేమ్‌లో’’ అని మరో నెటిజన్ పోస్టు చేశారు. యువతి, చిరుత ముద్దులాట వీడియో మీరూ
చూసేయండి.