రాజకీయ నాయకులకు జనం కనిపించగానే చేతులూపడం అలవాటు. అయితే, అక్కడ జనం లేకున్నా అభివాదం చేస్తూ సెర్బియన్ ప్రెసిడెంట్ నవ్వులపాలయ్యాడు. ప్రెసిడెంట్‌ను చూసి పక్కనే ఉన్న ప్రధాని చేయి ఊపాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయాడు. వీళ్లిదరి చేష్టలు చూసిన నెటిజన్లు భలే నవ్వకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బెల్గ్రేడ్-బుడాపెస్ట్ మార్గంలో కొత్త మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్తోపాటు ప్రధాని ఆర్బన్ కూడా పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన తర్వాత ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని ప్రయాణించారు. అయితే, ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్ కిటికీలోంచి చూస్తూ ప్లాట్‌ఫాంపై ఎవరూ లేకున్నా అభివాదం చేశారు. కన్ఫ్యూజన్లో పక్కనే ఉన్న ప్రధాని ఆర్బన్కూడా చేతులూపారు. ఆ వెంటనే అక్కడ ఎవరూ లేరని తెలుసుకుని ఖాళీగా కూర్చుండిపోయారు. కానీ, వుసిక్ మాత్రం చేతులూపుతూనే ఉన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కొందరు ఫన్నీ కామెంట్లు చేశారు. మళ్లీ వచ్చినప్పుడు అక్కడ జనాలను ఉంచుతాంలే అంటూ చమత్కరించారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 2.1మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
Serbian President waving at nobody pretending there’s a crowd gathered there to celebrate the new railway line is one of the best metaphors for politican-voter interactions I’ve seen in a long while pic.twitter.com/oYOvmkb1R9
— Yugopnik (@yugopnik) March 28, 2022