న్యూఢిల్లీ : తాత, నానమ్మల ప్రేమ దక్కించుకునే వారు ఎంతో అదృష్టంతులని చెబుతుంటారు. కల్మషం లేని నిస్వార్ధ ప్రేమను పెద్దలు తమ పిల్లల పట్ల చూపుతుంటారు. ఓ వ్యక్తి తన తాతతో మూవీ థియేటర్‌కు వచ్చిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. 42 ఏండ్ల తర్వాత ఆ వృద్ధుడు థియేటర్లో మనవడితో కలిసి అడుగుపెట్టాడు.
డాక్టర్ దీపక్ అంజ్నా ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో సంప్రదాయ కుర్తా, ధోవతి ధరించిన దీపక్ తాత ఎస్కలేటర్‌పై వెళుతూ కనిపించారు. ఆపై తాతా మనవళ్లు మూవీ చూసేందుకు థియేటర్ లోపలికి వెళ్లడం కనిపించింది. థియేటర్ పరిసరాలను తాత ఎంజాయ్ చేస్తుండటం కనిపించింది.
మీరు మీ తాతతో మూవీకి వెళుతుంటారు..మా తాత చివరిసారిగా 1980లో థియేటర్‌కు వెళ్లారని ఈ వీడియోకు టెక్ట్స్‌ను జోడించారు. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 6 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. కొందరు హార్ట్‌టచింగ్, ఓవర్వెల్మింగ్ అంటూ కామెంట్ చేయగా మరో యూజర్ ఇది చూడచక్కని వీడియో..సో స్వీట్ అంటూ రాసుకొచ్చాడు.