పులులు నీటిలో ఈతకొట్టే వీడియోలు తరుచూ చూస్తుంటాం. కానీ నీటిలో అవి వేటాడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సింహాల్లా కాకుండా పులులు ఒంటిరిగా వేటాడేందుకే ఇష్టపడతాయి. కాగా, ఓ పులి నీటిలో ఈదుతున్న బాతును వేటాడే వీడియో నెట్టింట వైరల్గా మారింది. పులి, బాతు దాగుడు మూతలు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఈ వీడియోను బిటింగెబిడెన్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. నీటిలో బాతు ప్రశాంతంగా ఈతకొడుతూ కనిపిస్తుంది. దాని వెనుకే ఓ పులి వేటాడేందుకు వస్తుంది. ఇది గమనించిన బాతు నీటిలో మునిగి కొంత దూరంలో తేలుతుంది. పులినోటికి చిక్కకుండా తప్పించుకుంటుంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పటివరకూ 4.8 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
Duck vs tiger.. 😂 pic.twitter.com/dVYLgI02aO
— Buitengebieden (@buitengebieden) June 7, 2022