ఏ ప్రాణికైనా సరే.. తన బిడ్డ అంటే చచ్చేంత ప్రేమ ఉంటుంది. మనుషులకే కాదు.. జంతువులుకు, ఇతర జీవులకూ ఫ్యామిలీ ఉంటుంది. వాటికీ పిల్లలు ఉంటాయి. వాటికి ఏమైనా అయితే అవి తట్టుకోలేవు. తాజాగా చైనాలోని సౌత్ చైనా సముద్రంలో హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది.
సౌత్ చైనా సముద్రంలో ఉండే చైనీస్ వైట్ డాల్ఫిన్ తన బేబీ డాల్ఫిన్ కోసం పడిన కష్టం చూస్తే అందరికీ కంటతడి తెప్పిస్తుంది. తన బేబీ డాల్ఫిన్ చనిపోవడంతో.. ఏం చేయాలో తెలియని తల్లి డాల్ఫిన్.. దాన్ని సముద్రం లోపలికి వెళ్లనీయకుండా.. అడ్డుకొని.. పైకి లేపేందుకు తెగ ట్రై చేసింది.
దానితో పాటు మరికొన్ని డాల్ఫిన్స్ కూడా అక్కడ చేరుకొని తన బేబీ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాయి. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే.. ఆ తల్లి డాల్ఫిన్ పడే ఆరాటాన్ని చూసి చలించిపోతున్నారు. తన బేబీ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక.. తన కళ్లముందే అది ఉండాలని ఆ తల్లి పడిన తపనను చూసి కంటతడి పెడుతున్నారు.
Heartbreaking video: Mother dolphin refuses to let dead calf go pic.twitter.com/KygEUIB3Hs
— CGTN (@CGTNOfficial) September 15, 2021
ఆ డాల్ఫిన్లు చాలా అరుదైన జాతికి చెందినవి. వాటినే చైనీస్ వైట్ డాల్ఫిన్స్ అని అంటారు. పింక్ డాల్ఫిన్స్ అని కొందరు పిలుస్తారు. అయితే.. ఈ డాల్ఫిన్ల జాతి రోజురోజుకూ అంతరించిపోతోంది. వీటి గ్రోత్ రేట్ చాలా స్లోగా ఉంటుంది. రీప్రొడక్షన్ కూడా తక్కేవే. అందుకే.. ఈ జాతి డాల్ఫిన్లను అంతరించిపోతున్న జాబితాలో చేర్చారు.
VIDEO: Rare pink dolphins are enjoying a comeback in the waters between Hong Kong and Macau after the coronavirus pandemic halted ferries, but scientists remain deeply concerned about their long-term survival in such a busy thoroughfare. pic.twitter.com/ohzb4Hy3jD
— AFP News Agency (@AFP) October 16, 2020
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్